Kajal Aggarwal : శ్రీవారి సేవలో కాజల్ అగర్వాల్

by sudharani |   ( Updated:2023-01-31 09:46:11.0  )
Kajal Aggarwal  : శ్రీవారి సేవలో కాజల్ అగర్వాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె తరించారు. స్వామి వారికి మెుక్కులు చెల్లించుకున్నారు. కాజల్ శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దర్శనం అనంతరందర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాజల్‌కు తోడుగా ఆమె తల్లి కూడా ఉన్నారు. ఇకపోతే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరో. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో జరుగుతున్న సంగతి తెలిసిందే.

READ MORE

Sudheer Babu's Hunt Movie OTT Release update

Advertisement

Next Story