ఇష్టం ఉంటే ఏ పని కష్టంగా అనిపించదు.. కాజల్ కామెంట్స్ వైరల్

by Prasanna |   ( Updated:2023-10-18 07:08:48.0  )
kajal agarwal
X

దిశ, సినిమా: అప్ కమింగ్ మూవీ ‘భగవంత్ కేసరి’ ప్రచారంలో భాగంగా కాజల్ అగర్వాల్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుండగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న కాజల్.. పెళ్లి తర్వాత అమ్మాయిలకు ఊహించని సవాళ్లు ఎదురవడం కామన్ అంటోంది. ‘ఇది సమాజానికి చాలా అవసరమైన కథ. ఆడపిల్లలను బలంగా తయారు చేయాలనే అంశం బాగా నచ్చింది. నా కాత్యాయని క్యారెక్టర్ అందరినీ ఆలోచింపజేస్తుంది’ అని చెప్పింది. అలాగే ఒకవైపు తల్లిగా, నటిగా రానించడంపై స్పందిస్తూ.. ‘మనం చేస్తున్న పనిపై ఇష్టం ఉంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా దాటుకుని ముందుకెళ్తాం. ప్రతి తల్లిలాగే పర్సనల్ లైఫ్‌తోపాటు వృత్తిని సమన్వయం చేసుకుంటున్నాను. ఈ జర్నీలో మా అమ్మ పాత్ర చాలా కీలకమైనది. ఆమె నాకు చేస్తున్న గొప్ప సహాయం గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని కాజల్ వెల్లడించింది.

Advertisement

Next Story