Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా నా మీద పగ పట్టింది..

by Prasanna |   ( Updated:2023-02-23 07:34:41.0  )
Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా నా మీద పగ పట్టింది..
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ మూవీకి కంగన కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తోంది. సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ''ఎమర్జెన్సీ' అనేది భారత రాజకీయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కాలాలలో ఒకటి. ఇది మనం అధికారాన్ని చూసే విధానాన్ని మార్చింది. అందుకే నేను ఈ కథను చెప్పాలని నిర్ణయించుకున్నా' అని కంగన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇక ఈ మూవీని అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నట్లు అప్‌డేట్ ఇచ్చిన నటి.. తాను మూవీ రీలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు బాలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా రిలీజ్ డేట్ లేదు. కానీ, తాను డేట్ ప్రకటించగానే సేమ్ అదే డేట్‌కి పలు సినిమాలు పోటీకి వస్తున్నాయని వాపోయింది. అమితాబ్ బచ్చన్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ అక్టోబర్ 20న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కంగన.. 'ఈ బాలీవుడ్ మాఫియాలో అసలు ఏం జరుగుతుంది' అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed