‘కబ్జ’.. ‘కేజీఎఫ్‌’కు చీప్ వర్షన్?

by sudharani |   ( Updated:2023-03-18 06:42:53.0  )
‘కబ్జ’.. ‘కేజీఎఫ్‌’కు చీప్ వర్షన్?
X

దిశ, సినిమా: భారీ అంచనాలతో వచ్చిన ‘కబ్జ’ అంచనాలను అందుకోలేక పోయింది అంటున్నారు నెటిజన్స్. ఈ రోజు గ్రాండ్‌గా రిలీజైన మూవీ గురించి ట్విట్టర్‌లో నెగెటివ్ రివ్యూస్ హైలెట్ అవుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివ రాజ్‌ కుమార్ కీలకపాత్రల్లో వచ్చిన సినిమా.. కేజీఎఫ్‌ను కాపీ కొట్టినట్లు ఉందని విమర్శిస్తున్నారు. సుదీప్, శివ రాజ్ కుమార్ రోల్స్ అతిథిపాత్రల మాదిరిగా ఉన్నాయని, సినిమా నుంచి మధ్యలోనే వెళ్లిపోవాలనే ఫీలింగ్ వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ చీప్ వర్షన్, బ్యాడ్ ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయారని అంటున్నారు. అయితే అభిమానులు మాత్రం బ్లాక్ బస్టర్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

Advertisement

Next Story