23 ఏళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న జ్యోతిక

by Anjali |   ( Updated:2023-05-15 09:20:36.0  )
23 ఏళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న జ్యోతిక
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా తమిళ, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటించిన జ్యోతిక హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ నటి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హిందీ చిత్రాల్లో నటించనుంది. కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్‌తో జ్యోతిక స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాపై తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక జ్యోతిక 1998లో ‘డోలీ సాజా కే రఖ్నా’ మూవీతో బాలీవుడ్‌లో తన నటనను ప్రారంభించగా, ఆమె చివరిసారిగా 2000లో బహుభాషా చిత్రం ‘లిటిల్ జాన్’ తో హిందీలో కనిపించింది.

Read more:

సమయానికి ఆదుకున్నావు.. అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

రవితేజతో డైరెక్టర్ అనుదీప్ మూవీ.. రచ్చ రచ్చే..

ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. నటి కామెంట్స్ వైరల్

Advertisement

Next Story