ఇంట్లో వాళ్లను ఎదురించి మరీ జ్యోతిక సంచలన నిర్ణయం..!

by Hamsa |
ఇంట్లో వాళ్లను ఎదురించి మరీ జ్యోతిక సంచలన నిర్ణయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ జ్యోతిక పలు సినిమాలతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకుని నటనకు గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి కొద్దికాలం ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంది. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తోంది. తాజాగా, జ్యోతిక సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుందట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి హీందీలో ఎంటర్లైన్మెంట్ బ్యానర్‌పై ఓ వెబ్ సిరీస్ వస్తుంది.

ఐదు మంది గృహిణులు ఓ బిజినెస్ మొదలు పెడితే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తందనే దానిపై కథ ఉంటుందట. ఈ వెబ్ సిరీస్‌లో జ్యోతిక ఓ కీలక పాత్ర పోషిస్తుందట. కానీ, జ్యోతిక మళ్లీ నటించడం సూర్య తండ్రి బైల్వాన్ రంగనాథన్‌కు ఇష్టం లేదట. అయినా సూర్య సపోర్ట్‌తో ఇంట్లో వారిని ఎదురించి మరీ జ్యోతిక మళ్లీ సినిమాల్లో నటింస్తుందని టాక్.

Advertisement

Next Story