- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా వల్లే జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో ఉన్నాడు.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో హాస్య నటుడిగా గుర్తింపు పొందిన వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. చిత్ర పరిశ్రమలో దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాల్లో నటించి.. మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఈ మధ్య కాలంలో మాత్రం వెండి తెరపై కనిపించడం లేదు శ్రీనివాస్. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జూనియర్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగి దాదాపు చావు చివరి అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే.. ఎన్నికల సమయంలో తనతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ ప్రచారంలో పాల్గొనాలని చెప్పాడు ఎన్టీఆర్. ఒక్కొక్కరు ఒక్కో రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఖమ్మం దగ్గర ప్రచారం చేస్తుండగా ఆరోజు పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీనివాస్ వెళ్లారట.
ఇక అన్ని పూర్తి అయ్యి బయలుదేరే సమయంలో నేను ఎన్టీఆర్ ఒకే కారులో వెళ్లాల్సి ఉంది. కానీ నేను బ్యాగ్ మర్చిపోయిన కారణంగా వెనక్కి వెళ్లడంతో ఆయన వెళ్లిపోయారు. ఆ వెనుకే నేను వేరే కారులో వెళ్లాను. అయితే.. ఆయన సూర్యాపేట జిల్లాలోకి ఎంట్రీ కాగానే ఎన్టీఆర్ కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఆయన మొత్తం రక్తంతో తడిసిపోయి ఉండటంతో నేను వెంటనే నా దగ్గర ఉన్న టవల్ కట్టి ఆయనను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాను. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత తనని తిరిగి సిటీకి తరలించామని శ్రీనివాస్ తెలిపారు. ఆ రోజు నేను ఉండబట్టే ఎన్టీఆర్ ప్రాణాలతో వచ్చారు. కానీ, కొందరు వ్యక్తులు మాత్రం నాపై తప్పుడు ప్రచారాలు చేశారు. నేను ప్రచార కార్యక్రమాల్లో అడుగు పెట్టడం వల్లే ఎన్టీఆర్‌కు అలాంటి ప్రమాదం జరిగిందంటూ మాట్లాడారు. ఆ విషయం నన్ను ఎంతగానో బాధపెట్టింది. నిజానికి నేను అక్కడ ఉండబట్టే ఆయన ప్రాణాలు కాపాడగలిగాను అంటూ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.