- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janhvi Kapoor: ట్రాప్‌లో జూనియర్ ఎన్టీఆర్.. ‘Devara’ చేతులెత్తేశాడా?
దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండియావైడ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ లాంగ్వేజ్.. ఈ లాంగ్వేజ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ట్రిపులార్ సినిమా సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. అయితే, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో జాన్వీ ఒక మత్సకారుడి పాత్రలో నటిస్తుందని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ పాత్ర గురించి మరికొద్దిగా ఇంఫర్మేషన్ బయటకు వచ్చింది. జాన్వీ ఈ సినిమాలో ఒక రా ఏజెంట్‌గా నటిస్తుందని.. ఈమె ఎన్టీఆర్ పాత్రను ట్రాప్ చేయడం కోసం ఒక మత్సకారుడి కూతురుగా నటిస్తుంది అని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు డేట్స్ భారీగా ఇచ్చేసిందట జాన్వీ. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్లు క్లారిటీ ఇచ్చారు.
Also Read..