- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jr.NTR: ఆస్కార్ తీసుకొని ఇండియాకు వచ్చిన తారక్ కి గ్రాండ్ వెల్కమ్
దిశ, సినిమా: ‘RRR’ సినిమాలోని నాటు నాటు పాటకు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో.. ఆస్కార్ అవార్డ్ దక్కిన విషయం మనందరికీ తెలుసు. మరి వేడుకల్లో పాల్గొన్న తారక్ ఇప్పుడు ఈ గ్రాండ్ ఈవెంట్ అనంతరం హైదరాబాద్‌కి తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి అడుగు పెట్టారు. దీంతో తారక్‌కి గ్రాండ్ వెల్కమ్ అందించింది హైదరాబాద్. ఈ సందర్భంగా.. అభిమానులు, రిపోర్టర్.. ఎయిర్‌పోర్టులో NTR ను ఒక సారిగా గుమ్మిగూడారు. మీకు ఎలా అనిపిస్తుంది.. ఆస్కార్ అందుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటూ .. వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు.. దానికి తారక్ మాట్లాడుతూ.. ‘ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లు ఆస్కార్ అవార్డును స్వీకరించడం బెస్ట్ మూమెంట్, వారిద్దరిని స్టేజ్ పైన చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ మూవీలో భాగం అయినందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ ని ఇంతలా ప్రోత్సహించినందుకు ప్రతి భారతీయుడికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మేము గెలుచుకున్న ఈ అవార్డు ప్రేక్షకుల ప్రేమ, చిత్ర పరిశ్రమ కారణం.. ఇందుకుగాను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం.. ’ అని NTR తెలిపారు.ఇక చివర్లో ‘‘ ఆస్కార్ చాలా బరువుగా ఉంది.. మన దేశం లాగానే’’ అంటూ వెళ్లిపోయాడు.