ప్రియుడి వేధింపులు భరించలేక నటి సూసైడ్.. తల్లి ఆరోపణలు

by sudharani |   ( Updated:2022-08-18 11:03:51.0  )
ప్రియుడి వేధింపులు భరించలేక నటి సూసైడ్.. తల్లి ఆరోపణలు
X

దిశ, సినిమా : దివంగత నటి జియా ఖాన్ మరణంపై తల్లి రబియా ఖాన్ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ మేరకు తన కూతురు ఆత్మహత్యకు బలమైన కారణాలున్నాయని ముంబైలోని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. జియా చనిపోయే కొన్ని నెలల ముందు ఆమె ప్రియుడైన నటుడు సూరజ్ పంచోలి శారీరకంగానేకాదు మానసికంగానూ వేధించాడని ఆరోపించింది. అలాగే ప్రతిరోజూ దుర్భాషలాడుతూ హింసించేవాడన్న ఆమె.. జియాకు అతన్ని కలవాలని లేకున్నా బయటకు రమ్మని పట్టుబట్టేవాడని, దీంతో అయిష్టంగానే భయపడుతూ వెళ్లేదని చెప్పింది. అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన నిందితుడు సూరజ్.. అదంతా అబద్దమని తాము మంచి స్నేహితుల్లాగే నడుచుకునేవాళ్లమని వాదనలు వినిపించాడు. ఇక 2013లో జియా సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో జైలుపాలైన సూరజ్ ప్రస్తుతం బెయిల్‌పై కోర్టు విచారణకు హాజరవుతున్నాడు.

బాలీవుడ్‌ హీరోలకు చుక్కలు చూపిస్తోన్న టాలీవుడ్ హీరో!

Advertisement

Next Story