బలవంతంగా విస్కీ తాగించి.. ఆ ప్లేస్‌లో ముద్దు కావాలని వేధించాడు

by samatah |   ( Updated:2023-05-12 14:18:06.0  )
బలవంతంగా విస్కీ తాగించి.. ఆ ప్లేస్‌లో ముద్దు కావాలని వేధించాడు
X

దిశ, సినిమా: నిర్మాత అసిత్ కుమార్ మోడీ లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ సంచలన ఆరోపణలు చేసిన జెన్నిఫర్ మిస్త్రీ.. తాజాగా ఇందుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటపెట్టింది. ‘2019లో ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ బృందం మొత్తం సింగపూర్‌ వెళ్లాం. ఆ పర్యటనలో ఒక రోజు అసిత్ నన్ను తన గదిలోకి పిలిచి విస్కీ తాగమని ఒత్తిడి చేశాడు. తర్వాత రోజు ‘నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నేను నిన్ను అక్కడ పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నా’ అంటూ బలవంతం చేశాడు. అంతటితో ఆగకుండా ప్రైవేట్ పార్ట్స్ తాకేందుకు ట్రై చేశాడు’ అంటూ తాను ఎదుర్కొన్న భయానక సంఘటనలను చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

మళ్లీ బుక్కైన న‌రేష్, ప‌విత్రా లోకేష్..

Advertisement

Next Story