ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడానికి అసలు కారణం ఆమె.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

by Satheesh |   ( Updated:2023-03-14 10:22:14.0  )
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడానికి అసలు కారణం ఆమె.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ యాక్టర్స్ రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ చిత్రం ప్రపంచ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్‌ను గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. భారత సినిమాకు ఎన్నో ఏళ్ల కళగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డ్‌ను ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ తీర్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డ్ సాధించి టాలీవుడ్ సత్తాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది.

ఇక, ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ సాధించడంతో సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా కొందరు మీమర్స్ ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో ఓ భాగంగా ఓ మీమర్ క్రియేట్ చేసిన ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతోంది.

కాగా, ఈ మీమ్‌లో ‘‘మీరెన్నైనా చెప్పండి.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ రావడానికి కారణం జెన్నీ పాప.. ఆసలు ఆమె గనుక ఎన్టీఆర్, చరణ్‌ను పార్టీకి పిలవక పోతే మనవాళ్లు అక్కడికి వెళ్లేవాళ్ళా.. నాటు నాటు పాటకి డ్యాన్స్ వేసేవాళ్లా’’ అంటూ క్రియేట్ చేసిన ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు సైతం ‘‘అవును బ్రో నిజమే’’ అంటూ ఫన్నీ కామెంట్స్ రియాక్ట్ అవుతున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రంలో బ్రిటిష్ యాక్టర్ ఒలివియా మోరిస్ జెన్నీఫర్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story