షారుఖ్‌ను ఓ రేంజ్‌లో చూపించబోతున్న సౌత్ డైరెక్టర్.. ‘జవాన్’ రిలీజ్ డేట్ లాక్..

by sudharani |   ( Updated:2023-05-08 04:48:31.0  )
షారుఖ్‌ను ఓ రేంజ్‌లో చూపించబోతున్న సౌత్ డైరెక్టర్.. ‘జవాన్’ రిలీజ్ డేట్ లాక్..
X

దిశ, సినిమా : అట్లీ దర్శకత్వంలో కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న ‘జవాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు మాస్ మోషన్ పోస్టర్ ద్వారా ఎనర్జిటిక్ అప్‌డేట్ ఇచ్చారు. బాద్‌షాను ఓ రేంజ్‌లో చూపించిన అట్లీ అండ్ టీమ్.. సెప్టెంబర్ 7న థియేటర్స్‌లో సినిమా సందడి చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించనుండగా.. మరిన్ని వివరాలు త్వరలో షేర్ చేయబోతున్నారు. ఇక ఈ మోషన్‌ పోస్టర్‌పై స్పందిస్తున్న అభిమానులు.. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు రిలీజ్ కాబోతున్న మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు.

Also Read: OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ ,హిందీ, మరాఠీ సినిమాలివే!

Advertisement

Next Story