అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరుమీదున్న 'జవాన్'

by Shiva |   ( Updated:2023-09-06 07:12:54.0  )
అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరుమీదున్న జవాన్
X

దిశ వెబ్ డస్క్ : బాలీవుడ్ బాద్ షా మూవీ రిలీజ్ అంటేనే దేశమంతటా ఓ పండగ వాతావరణం. ఆయన గత సినిమా పఠాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.వేయి కోట్లను కొల్లగొట్టింది. అయితే, ఆయన తాజాగా నటించిన జవాన్ చిత్రంపై కూడా ప్రేక్షకులకు పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతోంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 'జవాన్' అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరబాద్, కోల్‌కతా, చెన్నైల్లో ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తీరు చూస్తే జవాన్ మూవీ భారత చలనచిత్ర చరిత్రలో రికార్డులను క్రియేట్ చేసేలా కనిపిస్తుంది.

ఇప్పటికే పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో 1,70,295 టికెట్లు, ఐనాక్స్ 1,15,218 టికెట్లు, సినీ పోలీస్ లో 57,120 టికెట్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీ లో 60 వేల టికెట్లు, ముంబై లో 55 వేల టికెట్లు , బెంగుళూరు లో 60 వేల టికెట్లు , కోలకతా లో 50 వేల టికెట్లు , చెన్నై లో 75 వేల టికెటలు అమ్ముడయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.26 కోట్లు వచ్చేశాయి. దీంతో జవాన్ మూవీ బాహుబలి 2, గదర్ 2, పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మూవీలో నయనతార, దీపికా పదుకొనె, ప్రియమణి , విజయ్ సేతుపతి, యోగి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.

ఇవి కూడా చదవండి: ‘సలార్’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్

Advertisement

Next Story