ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్లు వసూలు చేసిన జవాన్

by Mahesh |   ( Updated:2023-09-26 04:30:20.0  )
ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్లు వసూలు చేసిన జవాన్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి 18 రోజులవుతున్న కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వద్ద ₹1000 కోట్లు వసూలు చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సోమవారం ట్విట్టర్‌లో జవాన్ యొక్క తాజా బాక్సాఫీస్ వసూళ్ల డిటైల్స్ షేర్ చేశారు. అలాగే జవాన్ దర్శకుడు అట్లీ కూడా క్లిప్‌ను షేర్ చేసి, “దేవుడు మన పట్ల చాలా దయ చూపాడు. అందరికీ ధన్యవాదాలు.. అని రాసుకొచ్చాడు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఒకే సంవత్సరంలో ₹1000 కోట్ల క్లబ్‌లో రెండు సినిమాలు సాధించిన తొలి భారతీయ నటుడిగా నిలిచిపోయాడు.

జవాన్ బాక్సాఫీస్

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శనివారం నాడు టోటల్ గ్రాస్ కలెక్షన్ ₹979.08 కోట్లు. ఆదివారం నాడు, ఈ చిత్రం మరో ₹25.84 కోట్లను వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ₹1004 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉండగా, Sacnilk.com నివేదిక ప్రకారం, జవాన్ తన మూడవ ఆదివారం భారతదేశంలో ₹14.95 కోట్ల నికర వసూలు చేసింది. దీంతో భారత బాక్సాఫీస్ మొత్తం వసూళ్లు ₹560.78 కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story