అమ్మలేని లోటు తెలుస్తోంది : జాన్వి

by Hamsa |   ( Updated:2022-08-09 07:57:18.0  )
అమ్మలేని లోటు తెలుస్తోంది : జాన్వి
X

దిశ, సినిమా : సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరి అంటే ఇట్టే గుర్తుకొచ్చే పేరు శ్రీదేవి. చూపు తిప్పుకోనివ్వని అందం, కట్టిపడేసే నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షక లోకాన్ని అలరించిన ఈ అందాల తారను కోల్పోవడం నిజంగా దురదృష్టకరమే. అయితే ఆమె వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇద్దరు కూతుర్లలో జాన్వీ కపూర్ మంచి నటనతో ఆకట్టుకుంటోంది. తన నటించిన 'గుడ్‌ లక్‌ జెర్రీ' చిత్రం ఇటీవలే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి.. తల్లి శ్రీదేవి గురించి పలు విషయాలు పంచుకుంది. 'అమ్మ గురించి మాట్లాడినప్పుడు గర్వంతో పాటు కొంత భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమె పోలికలు నాలో ఉన్నందున.. అందంలో కాదు, నటనలో కూడా తల్లి పేరు నిలబెట్టాలని కామెంట్స్‌ చేస్తున్నారు' అని చెప్పింది. కాగా ఇప్పుడు గనుక అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు తానే సమాధానం ఇచ్చి ఉండేదని ఎమోషనల్ అయ్యింది జాన్వి.

ముంబైలో విజయ్‌ దేవరకొండకు చేదు అనుభవం.. అలా అంటున్నారేంటి?

నా తమ్ముళ్లు నా స్నేహితులందరితో సెక్స్ చేశారు.. ఒక్కరూ మిగల్లేదు : హీరోయిన్

Advertisement

Next Story

Most Viewed