కోర్టును నవ్వులపాలు చేసిన జాన్వీ కపూర్.. దుమ్మెత్తిపోస్తున్న జనాలు..

by Sujitha Rachapalli |
కోర్టును నవ్వులపాలు చేసిన జాన్వీ కపూర్.. దుమ్మెత్తిపోస్తున్న జనాలు..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవికి తగిన కూతురు అనిపించుకుంది. అభినయంలో ఇంకా ఆమె అంత ఎదగకపోయినా.. అందంలో మాత్రం అద్భుతం అనిపించుకుంటుంది. వరుస సినిమాలతో అలరిస్తూనే యాడ్స్ కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉన్న ఆమె కొత్తగా చేసిన అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయింది. కాగా ఈ యాడ్ లో నిందితురాలిగా కోర్టులోకి ఎంటర్ అయిన బ్యూటీ.. జడ్జితో సహా అందరినీ తన సువాసనతో మైమరపిస్తూ డ్యాన్స్ చేయిస్తుంది. అక్కడి నుంచి సింపుల్ గా వెళ్ళిపోతుంది.

అయితే ఈ యాడ్ లో జాన్వీ కామెడీ టైమింగ్ అమెజింగ్ ఉండగా.. సూపర్ అంటూ కోస్టార్స్ కొనియాడుతున్నారు. ఆమెకు ఒక కామెడీ ఫిల్మ్ పడితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ జనాలు మాత్రం విమర్శలకు దిగారు. ఈ యాడ్ న్యాయ వ్యవస్థను కించ పరిచినట్లుగా ఉందని తిట్టిపోస్తున్నారు. వెంటనే ఈ అడ్వర్టైజ్మెంట్ ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed