విజయ్ దేవరకొండ తల్లితో Janhvi Kapoor.. పిక్స్ వైరల్

by Hamsa |   ( Updated:2022-12-06 07:04:53.0  )
విజయ్ దేవరకొండ తల్లితో Janhvi Kapoor.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా లేడి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇక వారిలో శ్రీదేవి కూతురు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఒకరు. బాలీవుడ్‌లో అంతమంది సెక్సీ హీరోలు ఉన్నప్పటికీ తన క్రష్ విజయ్ దేవరకొండ అంటూ జాన్వీ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఛాన్స్ వస్తే అతనితో సినిమా చేస్తానని ఎన్నోసార్లు వెల్లడించింది. తాజాగా విజయ్ దేవరకొండ తల్లితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రాలను చూసిన అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుపుతున్నారు. 'అసలు వాళ్ల మధ్య ఏమ్ జరుగుతుంది? రహస్యంగా ఏదో నడుస్తుంది' అని చర్చిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : మళ్లీ కలవబోతున్న ప్రభాస్, త్రిష.. ఆనందంలో ఫ్యాన్స్

Advertisement

Next Story