రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్..!

by Shiva |   ( Updated:2023-04-23 13:32:42.0  )
రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్..!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'ఎన్టీఆర్ 30'తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే జాన్వీ, మరో టాలీవుడ్ స్టార్ సినిమాలోనూ నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్ అనంతరం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందనున్న మూవీలో హీరోయిన్ గా ఇప్పటికే జాన్వీని ఎంపిక చేసినట్లు సమాచారం. తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో నటించే బంపరాఫర్ కొట్టేసిన జాన్వీ... ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసింది.

Read more:

నటిని కాకపోతే.. ఆ పని చేసేదాన్ని: జాన్వీ

చిరు మూవీలో ఐటమ్ సాంగ్.. శ్రియ భారీ డిమాండ్?

Advertisement

Next Story