- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Janhvi Kapoor:ఫ్లైట్ ఎక్కేముందు జాన్వీ కపూర్‌కు పక్షవాతం.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు హిందీలో పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులతో తన క్రేజ్‌ను పెంచుకుంది. వరుస ఆఫర్లు అందుకుంటూ అమ్మడు స్టార్ హీరోయిన్ హోదా కోసం తాపత్రయ పడుతోంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే తెలుగులో మరో రెండు చిత్రాల్లో నటించనుంది. అయితే జాన్వీ కపూర్ హిందీలో ఉలజ్ మూవీ చేసింది. ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ఈ బ్యూటీకి ఫుడ్ పాయిజన్ కావడంతో ముంబైలోని హాస్పిటల్‌లో జాయిన్ అయినట్లు ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత ఆమె డిశ్చార్జ్ అయింది.
తాజాగా, జాన్వీ కపూర్ ఉలజ్ ప్రమోషన్స్‌లో భాగంగా తన హెల్త్‌కు సంబంధించిన విషయాలు తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ హాస్పిటల్‌లో జాయిన్ కావడం ఫస్ట్ టైమ్. ఒక ఈవెంట్ కోసం చెన్నైకి వెళ్తుండగా ఆకలేసింది. దీంతో ఎయిర్‌పోర్టులో ఫుడ్ తిన్నాను. ముందు బాగానే ఉన్నప్పటికీ కాసేపటికే కడుపు నొప్పి వచ్చింది. ఆ తర్వాత నీరసం వచ్చేసరికి చాలా భయమేసింది వణికిపోయాను. కానీ హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్లాను. అప్పుడు నాకు పక్షవాతం వచ్చిన ఫీలింగ్ కలిగింది. దీంతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను.
అయితే నాకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్లు పరీక్షలు చేశాక రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు. లివర్ బాగా ఇబ్బందికి గురవడంతో రెండు, మూడు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్పారు. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. కానీ ప్రస్తుతం కోలుకున్నాను. మళ్లీ సినిమాలతో బిజీ అయిపోతున్నాను’’ అని చెప్పింది. ప్రస్తుతం జాన్వీ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో అంత సీరియస్ అయిందా? అని ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నారు.
- Tags
- Janhvi Kapoor