బెడ్ రూమ్‌లో బాయ్ ఫ్రెండ్‌తో తన తండ్రికి అడ్డంగా బుక్ అయిన జాన్వీ.. తర్వాత ఏం జరిగిందంటే?

by Jakkula Samataha |
బెడ్ రూమ్‌లో బాయ్ ఫ్రెండ్‌తో తన తండ్రికి అడ్డంగా బుక్ అయిన జాన్వీ.. తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా : అతిలోక సుందరి గారాల పట్టీ, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస సినిమాలతో చాలా బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ నటి రాజ్ కుమార్ రావు సరసన నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.

ఈ క్రమంలోనే జాన్వీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను తన అభిమానులతో పంచుకుంది. తాను బెడ్‌రూమ్‌లో ఫ్రెండ్‌తో తన తండ్రికి అడ్డంగా దొరికిపోయానంటూ ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. జాన్వీ మాట్లాడుతూ.. ఒక రోజు మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు. దీంతో అతన్ని మా బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. దీంతో ఒక్కసారిగా మా నాన్న వచ్చిన శబ్ధం వినబడి అతన్ని వెంటనే మా కిటికీ నుంచి ఇంటికి పంపించేశాను. ఇక మా నాన్నకు నేను దొరకలేదు అని ఆనందపడేలోపే మా డాడీ సీసీ కెమెరాలో నేను చేసిన పని మొత్తం చూసేశాడు. దీంతో కాస్త కోపానికి గురయ్యాడు. తర్వాత మా ఇంటి కిటికీలన్నింటినీ గ్రీల్స్‌తో మూసివేసి, నన్ను తిట్టి శిక్షించాడు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed