- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janhvi Kapoor: అలాంటి పాత్రలో నటించాల్సి వస్తే వెంటనే నో చెబుతానంటున్న జాన్వీ కపూర్
దిశ, సినిమా: దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు జాన్వీ కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ లీడ్ రోల్ లో నటించిన తాజా సినిమా ‘ఉలఝ్’. సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్ ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ షాకింగ్ విషయాలు చెప్పింది.
మీరు సినిమాల్లో ఎలాంటి పాత్ర చేయకుడదని నిర్ణయం తీసుకున్నారని యాంకర్ అడగగా దానికి జాన్వీ ఇలా బదులిచ్చింది. “ జుట్టు లేకుండా నటించాల్సి వస్తే నేను వెంటనే నో చెబుతా. ఎంత కష్టమైన పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నా.. కానీ, జుట్టు లేకుండా నటించలేను. అంత ఎందుకు ‘ఉలఝ్’లోని పాత్ర కోసం జుట్టు కట్ చేయాలనీ చెప్పారు.. నేను చాలా గొడవ పడ్డాను అని చెప్పుకొచ్చింది. నా మొదటి సినిమా ‘ధడక్’ కోసం హెయిర్ కట్ చేశా.. అప్పుడు మా అమ్మ బాగా అరిచేసింది.. ఎలాంటి రోల్ అయినా చెయ్.. కానీ జుట్టు కట్ చేసుకోవద్దని చెప్పింది. ఎందుకంటే ఆమెకి నాజుట్టంటే ఆమెకి చాలా ఇష్టం. అమ్మ మాతో ఉన్నప్పుడు మూడు రోజులకొకసారి ఆయిల్ రాసేది. అమ్మకి ఇష్టం లేని ఈ పని ఎప్పటికి చేయనని" చెప్పింది. దీంతో జాన్వీ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.