లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నా సరైన గుర్తింపు దక్కట్లేదు.. ఆ లిస్ట్ బయటపెట్టిన Janhvi Kapoor

by Prasanna |   ( Updated:2023-08-01 11:45:20.0  )
లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నా సరైన గుర్తింపు దక్కట్లేదు.. ఆ లిస్ట్ బయటపెట్టిన Janhvi Kapoor
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తన ఫేవరేట్ హీరోల లిస్ట్ బటయపెట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘దేవర’లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. తారక్‌తో పనిచేయాలనే కల నిజమైందంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో మురిసిపోయింది. అలాగే భవిష్యత్తులో ఎవరితో నటించాలనుకుంటున్నారని అడిగినప్పుడు.. రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ పేర్లు ప్రస్తావించింది. అంతేకాదు సీనియర్ హీరో హృతిక్ రోషన్‌ పట్ల కూడా ఆకర్షితురాలినయ్యానని, అతనితో కలిసి పనిచేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇక లక్షలాది మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో ఒకరిగా ఉన్నా.. అందుకు తగిన పేరు పొందలేకపోతున్నట్లు చెప్పింది. ఇందుకు కారణం తన గురించి తాను ఎక్కువగా ప్రచారం చేసుకోకపోవడమే అంటూ ముగించింది.

Advertisement

Next Story