Janhvi Kapoor : 4 కోట్లు ఇస్తే ఆ పనికి రెడీ అంటున్న జాన్వీ కపూర్..?

by Kavitha |   ( Updated:2024-07-13 15:28:09.0  )
Janhvi Kapoor : 4 కోట్లు ఇస్తే ఆ పనికి రెడీ అంటున్న  జాన్వీ కపూర్..?
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తుంది ఈ భామ. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌డమ్ అందుకుంది. అంతే కాకుండా ఇప్పుడు తెలుగులోను తన నటనతో ఆకట్టుకోవడానికి మన ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో హీరో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో, బుచ్చి బాబు దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ సరసన ఓ మూవీలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తున్నది జాన్వీ కపూర్.

ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ.. ఊహు అంటావా మావ అనే ఐటెం సాంగ్ ఎంత పాపులారిటీ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వేన్స్‌గా వస్తున్న పుష్ప 2 మూవీలో కూడా ఐటెం సాంగ్ అదే రేంజ్‌లో ఉండాలని ప్లాన్ చేస్తున్నాడంట సుకుమార్. ఇక ఇప్పటికే అదిరిపోయే ట్యూన్ రెడీ చేసుకుని పెట్టుకున్నాడంట దేవిశ్రీ ప్రసాద్. అయితే ఈ ఐటెం సాంగ్‌లో స్టార్ బ్యూటీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే దిశా పటానీ, త్రిప్తి డిమ్రి పేర్లు వినిపించగా.. జాన్వీ కూడా రేసులో ఉంది. ఇప్పటికే జాన్వీని పుష్ప 2 మేకర్స్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

అయితే జాన్వీ ఈ పాట కోసం ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఇక ఒక్క పాట కోసం 4 కోట్లంటే మామూలు విషయం కాదు. అందుకే జాన్వీ డిమాండ్‌తో మేకర్స్ ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప2 కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఆగష్టు 15 నుంచి డిసెంబర్ 6కి సినిమా పోస్ట్‌పోన్ అవడంతో.. నిర్మాతలపై అదనపు భారం పడుతోంది. మరి ఫైనల్‌గా పుష్పరాజ్‌తో చిందేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

Read More..

ఆ పార్ట్ చిన్నగా ఉండటంతో ఆఫర్లు రావడం లేదు.. సర్జరీ చేయించుకున్నానంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

Advertisement

Next Story