Janhvi Kapoor : అలాంటి పాత్రలకే ప్రయారిటీ ఇస్తా.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Javid Pasha |
Janhvi Kapoor : అలాంటి పాత్రలకే ప్రయారిటీ ఇస్తా.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలిసిందే. ఆమె గారాల కూతురు జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఆకట్టుకుంటోంది. తన నటన, అందం, అభినయంతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉలఝ్’. దేశ భక్తి కథాంశంతో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఇతివృత్తంగా రూపొంది, ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. జంగ్లీ పిక్చర్ బ్యానర్‌పై వినీత్ జైన్ నిర్మించిన ఈ స్పై థ్రిల్లర్ హిందీ మూవీకి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ థైలాంగ్, ఆదిల్ హుస్సేన్ ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే ‘ఉలఝ్’ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్న జాన్వీ కపూర్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇప్పటి వరకు రెండు హై రిస్క్ సినిమాలను ఎంచుకున్నానని, అందులో ‘ఉలఝ్’ ఒకటి అని తెలిపింది. ప్రజెంట్ తాను ఛాలెంజింగ్‌తో కూడిన పాత్రలకు కూడా ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నానని, ‘ఉలఝ్’ తనను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని వెల్లడించింది.

‘‘నా లైఫ్ అంతా మూవీస్‌కే అంకితం, ఫస్ట్ మూవీ మొదలు కొని ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండస్ట్రీ నన్ను ఎలా భావిస్తుందో చెప్పలేను కానీ.. సాంగ్స్, డ్యాన్స్, గ్లామరస్‌తో కూడిన కమర్షియల్ సినిమాలు ఎన్నో చేశాను. కేవలం అవే చేస్తే ఈజీ జర్నీ అయిపోతుంది కదా. కొంచెం రిస్క్ కూడా తీసుకోవాలనుకున్న. అలాంటి సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించడానికి, నటనా పరంగా దర్శకుడు నా నుంచి కోరుకున్నది వందశాతం నెరవేరుస్తా. అందుకే ‘ఉలఝ్’ లాంటి మూవీకి ప్రాధాన్యత ఇచ్చాను’’ అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.

Advertisement

Next Story