Janhvi Kapoor: ఐఎఫ్ఎస్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ చరణ్ హీరోయిన్

by sudharani |   ( Updated:2024-07-29 05:34:18.0  )
Janhvi Kapoor: ఐఎఫ్ఎస్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ చరణ్ హీరోయిన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉలఝ్’. సుధాంశు సరియా దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పత్రి అప్‌డేట్ ప్రుక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. అలాగే ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆధారంగా ‘సుహానా భాటియా (జాన్వీ కపూర్).. యువ ఐఎష్ఎస్ అధికారిణిగా బాధ్యతల్ని స్వీకరిస్తుంది. అయితే.. కొన్ని కుట్రలు కారణంగా అనేక ఆరోపణలు ఎదుర్కొవడమే కాకుండా విమర్శలు కూడా తలెత్తుతాయి. వాటిన్నిటిని ఎదుర్కొని ఎలా బయటపడుతుంది అనేది మూవీ స్టోరీ’.

ఈ ట్రైలర్‌తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందా అని ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు ప్రేక్షులు. మరి ఈ సినిమా జాన్వీ కపూర్‌కు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్ ‘దేవర’తో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ మూవీతో పాటు.. మరో రెండు సినిమాలు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story