నీకేమైనా పిచ్చి పట్టిందా.. చేతితో తలను కొట్టుకుంటూ,పెళ్లిపై షాకింగ్ రిప్లై ఇచ్చిన జాన్వీ (వీడియో)

by Jakkula Samataha |   ( Updated:2024-07-16 10:25:20.0  )
నీకేమైనా పిచ్చి పట్టిందా.. చేతితో తలను కొట్టుకుంటూ,పెళ్లిపై షాకింగ్ రిప్లై ఇచ్చిన జాన్వీ (వీడియో)
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీదేవి గారాల పట్టీగా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ నటి. ఇక బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కూడా పలు భారీ ప్రాజెక్ట్స్‌లో అవకాశం దక్కిచుకుంది. అయితే ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ వార్త ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. అది ఏమిటంటే జాన్వీ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరు బహిరంగంగానే కలిసి తిరుగుతారు. అంతే కాకుండా ఇటీవల అంబానీ పెళ్లిలో కూడా వీరిద్దరూ కనిపించారు. దీంతో మరోసారి తెరపైకి వీరి పెళ్లి పుకార్లు వచ్చాయి.

అయితే తాజాగా జాన్వీ తదుపరి చిత్రం ఉలజ్ కోసం జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ జాన్వీ పెళ్లిపై ప్రశ్నలు సంధించగా దానికి ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది. శిఖర్ పహారియాతో మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించినప్పుడు జాన్వీ ఒక్కసారిగా నీకు పిచ్చి పట్టిందా.. అంటూ ఆమె తన చేతితో నుదిటిపై కొట్టుకుంటూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి గురించి అడిగితే జాన్వీ అలా రెస్పాండ్ అవ్వడం ఏంటి అని తన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక ఉలాజ చిత్రం ప్రెస్ ఈవెంట్‌ల జాన్వీ చాలా ఆకర్షనీయంగా కనిపించింది. వైట్ ఆఫ్ షోల్డర్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్‌లో షర్ట్ కనిపిస్తుంది. అది అందరినీ తెగ ఆకట్టుకుంది.

Video credit to pallav_paliwal instagram channel

Advertisement

Next Story