Janhvi Kapoor : అతడి కారణంగా నా హార్ట్ బ్రేకైంది కానీ.. అతిలోకసుందరి డాటర్ ఎమోషనల్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-07-21 14:22:06.0  )
Janhvi Kapoor : అతడి కారణంగా నా హార్ట్ బ్రేకైంది కానీ.. అతిలోకసుందరి డాటర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ.. అతిలోకసుందరి దివంగత శ్రీదేవి గారాల జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘దేవర’ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఫస్ట్ మూవీనే జూనియర్ ఎన్టీఆర్ సరసన చాన్స్ కొట్టేయడం ఈ అమ్మడు లక్. ఇక ఇటీవల ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి జన్వీ కపూర్ సందడి చేసిన విషయం తెలిసిందే.

ఈ బ్యూటీ దేశభక్తి స్టోరీతో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ‘ఉలఝ్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఒక్కసారి మాత్రమే నా హార్ట్ బ్రేక్ అయింది. దానికి ఒక పర్సన్ కారణం. మళ్లీ అతడే నా పరిస్థితులను అర్థం చేసుకుని చక్కదిద్దాడు. పీరియడ్స్ టైంలో నాకుమూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటంతో నేను నా లవర్ పై ఎక్కువగా కోప్పడేది.

దీంతో నెలకోసారి బ్రేకప్ చెప్పేదాన్ని. తర్వాత రెండ్రోజులనంతరం క్షమాపణ అడిగేదాన్ని. ఇక అతడికి నా గురించి అర్థమై.. పోను పోను నా మాటల్ని పట్టించుకోలేదు. ఇక నా ఫ్యామిలీకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా తిరుమలకు దర్శనానికి వెళ్తాం. నేను నా పెళ్లి కూడా తిరుమలలోనే చేసుకోవాలనుకుంటున్నానని’ జాన్వీ వెల్లడించింది.

Advertisement

Next Story
null