Janhvi Kapoor : ప్లీజ్ నన్ను తీసుకోండి.. దర్శకనిర్మాతలను బతిమాలుతున్న శ్రీదేవి కూతురు

by Prasanna |   ( Updated:2023-07-10 06:46:45.0  )
Janhvi Kapoor :  ప్లీజ్ నన్ను తీసుకోండి.. దర్శకనిర్మాతలను బతిమాలుతున్న శ్రీదేవి కూతురు
X

దిశ, సినిమా: ‘బావాల్’ సినిమాలో అవకాశం దక్కించుకోవడం కోసం తను చేసిన చిలిపి పనుల గురించి ఓపెన్ అయింది జాన్వీ కపూర్. వరుణ్ ధావన్, జాన్వీ హీరోహీరోయిన్లుగా నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ మూవీ జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా.. ‘‘బావాల్’లో నేను నటిస్తానని దర్శకుడు నితేష్, నిర్మాత సాజిద్ నదియావాలా వెంటబడ్డాను. ఒప్పించడానికి నిరంతరం వెంబడించాను’ అని చెప్పింది జాన్వీ. ఇక దీనిపై మాట్లాడిన చిత్ర నిర్మాత.. ‘ఒక రోజు మా కార్యాలయంలోకి సడేన్‌గా వచ్చిన జాన్వీ.. ‘దయచేసి నన్ను ఆడిషన్ చేయండి’ అని అడిగింది. అయితే అప్పటికే నా ఇన్‌బాక్స్ ఆమె రిక్వెస్ట్ మెసేజ్‌లతో నిండిపోవడం చూసి షాక్ అయ్యాను. నిజంగా ఈ సినిమా కోసం ఆ అమ్మాయి కష్టపడిన తీరు అద్భుతం’ అంటూ నటిపై ప్రశంసలు కురిపించాడు.

Read More: ట్రాన్స్‌జెండర్‌తో సెక్స్.. తలుపులు మూసి టార్చర్ చేశారు: సల్మాన్ మాజీ ప్రేయసి

Sreeleela : దిల్‌రాజు ఆఫర్‌ను తిరస్కరించిన శ్రీ లీల!

Advertisement

Next Story