- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కంటెంట్ ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు: Vyjayanthi Movies
దిశ, సినిమా: తెలుగు చిత్రసీమలో అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్.. కాపీ రైట్స్‌కు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది. 1974లో సి.అశ్వనీదత్ స్థాపించిన ఈ సంస్థ అగ్రశ్రేణి సినీ తారలను తీర్చిదిద్దడంతోపాటు భారీ బడ్జెట్ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ సంస్థ నిర్మాణంలో 1990లో చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.
కాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ, సాంగ్స్, క్యారెక్టర్స్‌తోపాటు మూవీ రీమేక్, ప్రీక్వెల్, వెబ్ సిరీస్ ఇతరత్రా ప్రసార చిత్రాల్లో ఏ భాషలోనూ వాడుకోకూడదని పబ్లిక్ నోటీస్ జారీచేసింది సంస్థ. ఒకవేళ సంస్థ అనుమతి లేకుండా ఎలాంటి కంటెంట్ వాడినా కాపీ రైట్స్ కింద చట్టపరంగా సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘మా ‘#జగదేకవీరుడు అతిలోకసుందరి’ కంటెంట్‌ని అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది’ అంటూ ట్విట్టర్ వేదికగా నోట్ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతుంది.