ఆసుపత్రిలో సీరియస్ పొజిషన్‌లో జబర్దస్త్ కమెడీయన్.. సహాయం చేయాలంటూ పోస్ట్

by samatah |   ( Updated:2023-06-06 06:39:04.0  )
ఆసుపత్రిలో సీరియస్ పొజిషన్‌లో జబర్దస్త్ కమెడీయన్.. సహాయం చేయాలంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : జబర్ధస్త్ కమెడీయన్ పంచ్ ప్రసాద్ గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, సీరియస్‌గా ఉన్నట్లు ఇమాన్యుయేల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వీలైనంత త్వరగా ఆయనకు ఆపరేషన్ చేయాలని, ఆ ఆపరేషన్‌కు చాలా ఖర్చు అవుతుంది, దాతలు సహాయం చేయాలని కోరుతూ పోస్ట్ పెట్టారు. ఇక పంచ్ ప్రసాద్ గతంలో అనారోగ్యం బారిన పడి, ఆపరేషన్ తర్వాత కోలుకొని టీవీ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story