కాబోయే భార్యను పరిచయం చేసిన ‘జబర్దస్త్’ కమెడియన్!

by Hamsa |   ( Updated:2023-06-04 09:03:02.0  )
కాబోయే భార్యను పరిచయం చేసిన ‘జబర్దస్త్’ కమెడియన్!
X

దిశ, సినిమా: జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇందులో కమెడియన్ కెవ్వు కార్తీక్ ఒకరు. ప్రస్తుతం టీమ్ లీడర్‌గా ఉన్న కార్తిక్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ‘రెండు విభిన్న మనస్తత్వాలు, భిన్న జీవితాలు, వేర్వేరు ఆలోచనలు, వేర్వేరు ప్రపంచాలు ఇప్పుడు కలిసిపోయాయి. ఒకే జీవితాన్ని ప్రారంభించబోతున్నాం’ అంటూ తన భార్యను పరిచయం చేసాడు. అతని భార్య పేరు సిరి అని కూడా చెప్పేశాడు. ఇక కార్తీక్ తన ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌ విదేశాల్లో జరుపుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Advertisement

Next Story