'ధమాకా' కోసం రచయితగా మారిన హైపర్ ఆది..

by Hajipasha |   ( Updated:2022-09-25 13:52:03.0  )
ధమాకా కోసం రచయితగా మారిన హైపర్ ఆది..
X

దిశ,సినిమా: 'ధమాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు మాస్ మహారాజా రవితేజ. త్రినాథ్‌రావు నక్కిన ద‌ర్శకత్వం వ‌హించిన‌ ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రీ ప్రొడ‌క్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇటీవలే 'మాస్‌రాజా' అంటూ సాగే మాస్‌ బీట్‌ సాంగ్‌ను విడుదల చేయగా.. తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో కామెడీ స్కిట్‌ను 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదితో రాయించినట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రినాథరావు, హైపర్ ఆది మంచి స్నేహితులు కావడంతో సినిమాలో మరింత హస్యం జతచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఫ్యాన్స్‌కు పండగే.

భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సుధీర్‌..!? ఆందోళనలో ఫ్యాన్స్

Advertisement

Next Story