Adipurush : ‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ పెరగనున్నాయా?

by Hamsa |   ( Updated:2023-06-09 05:52:45.0  )
Adipurush : ‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ పెరగనున్నాయా?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. అసలు విషయం ఏంటంటే.. మూవీ టికెట్ రేట్స పెరుగుతాయట. కరోనా ఎఫెక్ట్ వల్ల ఇబ్బందులు ఎదర్కొన్న సినీ రంగానికి ఊరట కలిగించే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం స్టార్ హీరోల సినిమాల టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తులు ఇచ్చింది. అయితే ఆడియెన్స్‌లో తీవ్ర వ్యతిరేక‌త రావ‌డం, అలాగే OTT లు పెరగడం కారణంగా సినిమాల వ‌సూళ్లు త‌గ్గాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘ఆదిపురుష్’ మూవీ టికెట్ ధరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌లో ప్రచారం జ‌రుగుతోంది. ఎంతవరకు అంటే.. మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ. 100 నుంచి రూ. 150 యాభై వ‌ర‌కు, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50 నుంచి 100 వ‌ర‌కు అదనంగా టికెట్ ధరలు పెంచునున్నట్లు సమాచారం. త్రీడీ వెర్షన్ ధ‌ర‌లు కూడా పెరిగే అవ‌కాశం ఉన్నట్లు టాక్. త్వర‌లోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read More... సంప్రదాయ దుస్తుల్లో రెబల్ స్టార్‌ ప్రభాస్‌.. పోటీపడ్డ అభిమానులు

Advertisement

Next Story