- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది సెక్స్ సీన్ కాదు.. దారుణమైన రేప్.. మెహరిన్ సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మెహరీన్ గురించి తెలుగు అభిమానులకు సుపరిచితమే. పంజాబీ బ్యూటీ అయినా చీరకట్టి బొట్టు పెడితే మాత్రం అచ్చం తెలుగింటి అమ్మాయిగా మెరుస్తుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం మహానుభావుడు, కేరాఫ్ సూర్య, నోటా, పంతం, జవాన్, ఎఫ్ 2, ఎఫ్ 3 అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయ్’ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో మంచి ముద్ర వేసుకుంది.
అయితే మెహరీన్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో వచ్చిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో నటించింది. ఇన్నాళ్లుగా ఎంతో పద్ధతిగా కనిపించిన ఈమె ఈ వెబ్ సిరీస్‌లో కాస్త హాట్‌గా కనిపించడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. కొంతమంది జనాలు.. బూతులు తిడుతూ చెత్త కామెంట్స్ చేశారు. మెహరీన్ లిప్ లాక్ సెక్స్ సీన్లలో నటించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాజాగా ఈ హీరోయిన్ ఈ కామెంట్లపై అసహనం వ్యక్తం చేస్తూ..
‘‘కొన్ని సన్నివేశాలు నైతికతకు విరుద్ధంగా అనిపించినా.. ఓ నటిగా స్టోరీకి అనుగుణంగా అలాంటి రోల్‌లో నటించాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత బెడ్ రూమ్‌లో భర్త చేసే దారుణమైన రేప్ సీన్‌ను కొంతమంది సెక్స్ సీన్ అని రాస్తున్నారు. మీకు అక్కచెల్లెళ్లు, కూతుళ్లు లేరా? వారికి ఇలా జరిగితే అలాగే మాట్లాడుతారా?’’ అంటూ ఈ హీరోయిన్ మండిపడుతూ నెట్టింట పోస్ట్ పెట్టింది.