- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ స్పెషల్ పర్సన్ ఆ హీరోయినే.. కనిపెట్టేసిన అభిమానులు.. విత్ ఫ్రూఫ్‌తో పోస్టులు వైరల్
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యాచులర్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకుని సందడి చేస్తున్నారు. కానీ 44 ఏళ్లు వచ్చిన మన డార్లింగ్ మాత్రం ఇప్పటి వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా, మ్యారేజ్‌కు సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడా అని అభిమానులు ఎంతో ఈగర్‌గా ఎదరు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించింది.
‘డార్లింగ్స్.. ఫైనల్లీ వెరీ స్పెషల్ పర్సన్ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది. వెయిట్ చేయండి’ అంటూ మన రెబల్ స్టార్ పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ కావడంతో.. ఫైనల్‌గా వదినమ్మ రాబోతుందిరా అనుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరికొందరు ఇంకా నమ్మలేక పోతున్నారు. అన్న వచ్చి మళ్లీ ఎకౌంట్ హ్యాక్ అయిందని చెప్తాడేమో.. స్పెషల్ పర్సన్ అనేది ఏమీ ఉండదు’ అని కొందరూ నిరుత్సాహ పడుతున్నారు.
అయితే.. ప్రభాస్ పెట్టిన పోస్ట్‌తో ఇండస్ట్రీ షేక్ అవుతున్న క్రమంలో పాయల్ రాజ్ పుత్ సేమ్ సింక్‌లో అలాంటి పోస్టే పెట్టింది. ‘నేను ఖచ్చితంగా ఒకరి ప్రియమైన దానిని! ఎవరికో మీరేమైన గెస్ చెయ్యగలరా’ అంటూ ఇన్‌స్టా పోస్ట్ పెట్టింది. దీంతో నెట్టింట మరో కొత్త రచ్చ స్టార్ట్ అయింది. డార్లింగ్ ప్రభాస్ పెట్టిన పోస్ట్, పాయల్ పెట్టిన పోస్ట్‌ను సింక్ చేస్తూ.. నెట్టింట మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొందరు. దీంతో ఈ వార్తలు కాస్త నెట్టింట వైరల్ కావడంతో.. ‘మీతో మా అన్నకు ఎలాంటి సంబంధం లేదు కదా’ అని కొందరూ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం ‘మూవీ ప్రమోషన్స్ అయుంటాయిలే’ అంటూ లైట్ తీసుకుంటున్నారు.