'Avatar 2' రన్ టైమ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ

by sudharani |   ( Updated:2022-12-11 11:44:42.0  )
Avatar 2 రన్ టైమ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ
X

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం 'అవతార్ 2'. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్‌ 16న దాదాపు 160 దేశాల్లో రిలీజ్‌ కాబోతుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తుండగా ఇండియాలో ఇప్పటికే రూ.10 కోట్లు వచ్చాయట. ఇదిలావుంటే.. సినిమా రన్నింగ్ టైమ్ గురించి అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్ 'అవతార్ 2' సినిమా రన్ టైమ్ మొత్తం 3గంటల 12 నిమిషాలు ఉండనున్నట్లు తెలిపారు. కాగా 'అవతార్' మొదటి భాగం కేవలం 2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండగా రెండో పార్ట్ టైమింగ్ పెరగడంతో అభిమానుల్లో మరింత ఆతృత పెరిగింది.

Advertisement

Next Story