ఇది నాకు పునర్జన్మలాగే అనిపిస్తుంది : సుస్మిత

by sudharani |
ఇది నాకు పునర్జన్మలాగే అనిపిస్తుంది : సుస్మిత
X

దిశ, సినిమా: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది సుస్మితా సేన్. ఆ తర్వాత హీరోయిన్‌గా బాలీవుడ్‌‌లో అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇదిలావుంటే.. ఇటీవల గుండెపోటు బారిన పడిన సుస్మిత తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో డిజైనర్ అనుశ్రీ రెడ్డి కోసం ర్యాంప్ వాక్ చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ‘గుండెపోటు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత ఇదే నా మొదటి ర్యాంప్ వాక్. నాకు పునర్జన్మలా అనిపిస్తుంది. ఈ షోను నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story