ఆయన పిలుపుకోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నా.. Isha Talwar

by Anjali |   ( Updated:2023-05-02 12:05:37.0  )
ఆయన పిలుపుకోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నా.. Isha Talwar
X

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు హోమీ అదాజానియాతో కలిసి పనిచేయడంపై నటి ఇషా తల్వార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గత 8 ఏళ్ల క్రితం అతని సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లినా.. నటించే అవకాశం దక్కనందుకు చాలా బాధపడ్డానని చెప్పింది. అయితే ఇన్నాళ్లకు మే 5న విడుదలకాబోతున్న ‘సాస్ బహు ఔర్ ఫ్లెమింగో’కోసం హోమితో వర్క్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందన్న నటి.. ‘నేను అతని ప్రాజెక్ట్ కోసం 7-8 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా. హోమీ చాలా ఉద్వేగభరితుడు. ఆయన సినిమాలో పనిచేయడాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తా. ఆ కోరికే నన్ను ఈ ప్రాజెక్ట్ వైపు ఆకర్షించింది. ఈ మూవీలో నా క్యారెక్టర్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని పనిచేశా. ఈ సినిమా సెట్‌లోనూ గొప్ప అనుభూతి పొందాను’ అంటూ పలు విషయాలు వెల్లడించింది.


Advertisement

Next Story

Most Viewed