‘ప్రాజెక్ట్ కే’లో ప్రభాస్ కనిపించబోయే గెటప్ ఇదేనా..? కీలక విషయాలు లీక్..!

by Shiva |   ( Updated:2023-06-23 15:17:22.0  )
‘ప్రాజెక్ట్ కే’లో ప్రభాస్ కనిపించబోయే గెటప్ ఇదేనా..? కీలక విషయాలు లీక్..!
X

దిశ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో ఇప్పటికే సందడి చేస్తుంది. అయితే, తన తదుపరి చిత్రం సాలార్ మరో మూడు నెలల్లో విడుదల కానుంది. ఇప్పటికే రెబల్ అభిమానులు సలార్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. అదేవిధంగా మరో నాలుగు నెలల్లో ‘ప్రాజెక్ట్ కే’ కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక్కో అప్డేట్ ఇస్తూ.. అంచనాలు పెంచేస్తున్నాడు.

‘ప్రాజెక్ట్ కే’ కు సంబంధించి ఇప్పటికే చిత్ర నిర్మాత అశ్వినీదత్ కొంత హింట్ ఇచ్చారు. సోషియో ఫాంటసీ మోడ్ లో సినిమా ముందుకు సాగుతోందని, దేవుళ్లు, పురణాల ప్రస్తావన సినిమాలో నిర్లప్తమై ఉంటుందన్నారు. మరికొందరు ‘ప్రాజెక్ట్ కే’ అంటే ప్రాజెక్ట్ కృష్ణ అనే ప్రచారమూ జరుగుతోంది. మరోవైపు టైం ట్రావెల్ మూవీ అని, సైన్స్ ఫిక్షన్ జానర్ కూడా కావొచ్చని సినీ పండితులు చెబుతున్నారు. ఈ మూవీలో ఉపయోగించే ప్రతి వస్తువు స్క్రాచ్ అనే టెక్నాలజీలో రూపొందిస్తున్నారు.

‘ప్రాజెక్ట్ కే’లో ప్రభాస్ లుక్ ఏ విధంగా ఉంటుందనే విషయం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇంత వరకు ప్రభాస్ లుక్ బయటకు రాలేదు. యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తారట. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ లుక్ ఆ విధంగా డిజైన్ చేశాడట. ఇక ‘ప్రాజెక్ట్ కే’ 2024 జనవరి 12న విడుదల కానుంది. దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రను పోషిస్తుండటం విశేషం.

Advertisement

Next Story