- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ క్రికెటర్ అనసూయ కొడుకు.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్
దిశ, సినిమా: స్టార్ యాంకర్ అనసూయ నటిగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. అలాగే సోషల్ మీడియాలోనూ నిత్యం పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయ పేరు వినిపిస్తోంది. ఒక్కోసారి ఆమె పెట్టే పోస్టుల వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల ఉప్పల్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను చూడటానికి స్టేడియంకు వెళ్లింది.
ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్‌కు చెందిన క్రికెటర్ రియాన్ పరాగ్ సిక్స్ కొట్టడంతో ఆమె లేచి ఫుల్ ఎంజాయ్ చేసింది. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టి.. పలు ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఓ నెటిజన్ రియాన్ పరాగ్ అమ్మ అనసూయ అంటూ ఓ వీడియోను క్రియేట్ చేసి నెట్టింట పోస్ట్ చేశాడు. అది కాస్త ట్విట్టర్‌లో ట్రెండ్ కావడంతో ఆ వీడియోను చూసిన అనసూయ స్పందించి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
అంతేకాకుండా రియల్ వీడియోను కూడా షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది. ‘‘అందుకే అండి సరిగ్గా చూడాలి. సరిగ్గా వినాలి అంటారు పెద్దలు. రియాన్ పరాగ్ ఎవరు ఆయన తల్లి ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఏదో ఫుటేజ్ దొరికింది కదా అని వేసేయకూడదు. ముందు ఫూటేజ్ కూడా చెక్ చేసుకోవాలి కదండి. రీచ్ కోసం ఏది పడితే అది వేసేయడమే.. ముందు అలా చేసే ఆలోచన రాకుండా మారండి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. అనసూయ నెగిటివ్ కామెంట్లు వస్తే స్ట్రాంగ్ ఇచ్చిపడేసే ఆమె ఈ సారి ఇంత కూల్‌గా చెప్పడమేంటని నెట్టింట పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
Read More..
రెడ్ చిల్లిలా మెరిసిపోతున్న పూజా హెగ్డే.. ఈ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!