Shah Rukh Khan : షారుఖ్‌కు భార్య గౌరీ అంటే అంత భయమా?

by Prasanna |   ( Updated:2023-07-24 08:58:28.0  )
Shah Rukh Khan : షారుఖ్‌కు భార్య గౌరీ అంటే అంత భయమా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మూవీస్ విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో కుటుంబ పరంగా కూడా అంతే బాధ్యతగా ఉంటాడు. ఆయన గౌరీ‌ఖాన్‌ను వివాహం చేసుకుని 32 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు వారికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం షారుఖ్ వయసు 57 ఏళ్లు అయినప్పటికీ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇక అతని భార్య గౌరీఖాన్ (52) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది.

అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో షారుఖ్ ఖాన్ తన అభిమానులతో ముచ్చటిస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే షూటింగ్ కోసం బయటకెళ్లినపుడు తన భార్య గౌరీకి రోజుకు 8 నుంచి10 సార్లు ఫోన్ చేస్తానని చెప్పాడు. దీంతో ఎందుకు అన్నిసార్లు కాల్ చేయడం? మీకు మీ వైఫ్ అంటే భయమా? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీంతో ‘ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేస్తాను. ఒక్కోసారి ఐదు నిమిషాలకోసారి కాల్ చేస్తాను. నా భార్యతోనే కదా నేను మాట్లాడేది’ అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు బాద్ షా.

ఇవి కూడా చదవండి :: Surya-Jyothika ఎలా లవ్‌లో పడ్డారో తెలుసా..? ఆ రాత్రి ఆయన తిట్టకపోతే..! (వీడియో)

Advertisement

Next Story