Samantha : సమంత ప్రెగ్నెంట్.. వైరల్ అవుతున్న షాకింగ్ పోస్ట్!

by Jakkula Samataha |   ( Updated:2024-07-27 17:28:51.0  )
Samantha : సమంత ప్రెగ్నెంట్.. వైరల్ అవుతున్న షాకింగ్ పోస్ట్!
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. అయితే తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. అందులో బ్యూటీ కారులో కూర్చొని, చేతిలో ఏదో ఓపెన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి అది ప్రెగ్నెంట్ కిట్ టైప్‌లో ఉంటుంది. దీంతో అది చూసిన తన అభిమానులు ఖంగు తిన్నారు. సమంత ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటీ అని ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యారు. కానీ నిజానికి అది ఓపేర్.అందులో find honey on 01/08 అని రాసి ఉంటుంది. ఇక అది చూసిన తర్వాత సామ్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. దీంతో కొందరు సామ్ ప్రెగ్నెంట్ అని షాక్ అయ్యాం అని కామెంట్స్ చేస్తే మరికొందరు అవును అది ప్రెగ్నెంట్ కిట్ లానే ఉంది, సామ్ ప్రెగ్నెంట్ కార్డు ఓపెన్ చేసి చూపెట్టడం ఏంటీ అని అనుకున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story