పెళ్లి పీటలెక్కబోతున్న సమంత.. వరుడు ఆ హీరోనేనా?

by samatah |   ( Updated:2023-03-13 04:32:10.0  )
పెళ్లి పీటలెక్కబోతున్న సమంత.. వరుడు ఆ హీరోనేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత రెండో పెళ్లికి రెడీ అయ్యింది. గత కొన్ని రోజుల క్రితం అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ. పెళ్లైన నాలుగు సంవత్సరాలకే ఈ జంట విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. వారి వారి కెరీర్‌పై ఫొకస్ చేశారు.

గత కొన్ని రోజుల నుంచి సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, మరోసారి సమంత రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ విడాకుల తర్వాత పెళ్లి పీటలెక్కబోతుందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇంతకీ వరుడు ఎవరో కాదు విజయ్ దేవరకొండ. అయితే ఈ పెళ్లి రియల్ లైఫ్‌లో కాదంట, రీలే అంట. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీలో నుంచి స్టిల్స్ కొన్ని బయటకు వచ్చాయి. అందులో సమంత మెడలో ఓ తాళిబొట్టుతో కనిపించారు. ఈ సినిమాలో సమంత పెళ్లైన యువతి పాత్ర చేస్తున్నారంట, అంతే కాకుండా విజయ్ దేవరకొండ, సమంత మధ్య పెళ్లి సీన్ ఉన్నట్లు సమాచారం. దీంతో సమంత రియల్ లైఫ్‌లో విడాకులిచ్చి, రీల్ లైఫ్‌లో పెళ్లి పీటలెక్కబోతుందంటూ చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

నాకు ఎప్పుడో పెళ్లి జరిగింది తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

సమంతకు అబార్షన్ చేయించిన నాగచైతన్య..! ఇన్ని రోజులకు బయటపడ్డ నిజం

Advertisement

Next Story