బిజినెస్‌మెన్ మోజులో ప్రియుడిని మరిచిన రియా.. తెగ ఎంజాయ్ చేస్తుందట!

by Prasanna |   ( Updated:2023-08-30 13:08:16.0  )
బిజినెస్‌మెన్ మోజులో ప్రియుడిని మరిచిన రియా.. తెగ ఎంజాయ్ చేస్తుందట!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి రియా చక్రవర్తి లవ్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కొంతకాలం రిలేషన్‌లో ఉన్న రియా.. ఆయన అకాల మరణం తర్వాత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు డ్రగ్స్ కేసులో భాగంగా రియాను 2020లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేయగా ఒక నెల జైలు జీవితం అనుభవించి బయటకొచ్చింది. అయితే ఇంతకాలం ఒంటరిగా ఉంటున్న నటి ఇటీవల జీరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. భారతదేశంలోని అతి పిన్న వయస్కులలో నికర విలువ రూ. 9000 కోట్లు కలిగివున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన నిఖిల్ కామత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని.. డిన్నర్ డేట్, నైట్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త చర్చనీయాంశమవగా దీనిపై వీరిద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

Advertisement

Next Story

Most Viewed