ప్రభాస్‌ సరసన పార్వతి దేవిగా నటించేది నయనతారా లేక కంగన? అయోమయంలో ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2023-09-27 13:05:13.0  )
ప్రభాస్‌ సరసన పార్వతి దేవిగా నటించేది నయనతారా లేక కంగన? అయోమయంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు మొదటిసారి పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’తో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో తారక్, ప్రభాస్, నయనతార వంటి స్టార్స్ అంతా నటించబోతున్నారు. ఇక నయన్ పార్వతిగా, ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడనే వార్తలు బయటకు వచ్చినప్పటికి ఇప్పుడు సడెన్‌గా కంగన సైతం పార్వతి పాత్రను పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. అవును ప్రస్తుతం ‘చంద్రముఖి 2’ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న కంగన ఒకనొక ఇంటర్వూలో తను టాలీవుడ్ మూవీలో పార్వతి పాత్రలో కనించబోతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది.

‘పార్వతి మాతగా నటించమని ఆఫర్ వచ్చింది. చిన్న రోల్. నాలుగు రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందన్నారు’ అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు వీరిద్దరూ పార్వతిగ నటించేది ఒక సినిమానేనా? అసలు ఈ ఇద్దరిలో ఎవరు పార్వతి దేవిగా కనిపిస్తారు? ఇవన్నీ పుకార్లేనా? చిత్ర యూనిట్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదా? అనే గందరగోళంలో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story