మహేశ్ బాబు వల్లే ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం అయ్యిందా?

by samatah |   ( Updated:2023-02-02 09:25:45.0  )
మహేశ్ బాబు వల్లే ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం అయ్యిందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదం అభినయంతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక కెరటం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన ఆడిపాడింది.

అయితే గత కొన్ని రోజుల నుంచి రకుల్‌కు తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. దీనికి రకుల్ ప్రీత్ సింగ్ చేసిన మిస్టేక్సే అంటున్నారు పలువురు. అంతే కాకుండా ఓ స్టార్ హీరో సినిమాలో చేసినందుకే ఆమె కెరీర్ నాశనం అయ్యిందంటూ ముచ్చటిస్తు్న్నారు. అయితే అసలు ఏమైంది, ఏ హీరో సినిమాలో చేయడం వలన రకుల్ కెరీర్ నాశనం అయ్యిందో ఇప్పుడు చూద్దాం.

రకుల్ వరుసగా స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ కొన్నిసార్లు కథల ఎంపికలో తప్పటడుగు వేసి తన కెరీర్‌ను నాశనం చేసుకుంది. ఇక అలాంటి వాటిలో ముఖ్యంగా మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో హీరోయిన్‌గా చేసి, ఆ సినిమాలో రకుల్ నటనకు తన అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. అలాగే మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా వచ్చిన కొండపొలం సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం వల్ల కూడా రకుల్ క్రేజ్ టాలీవుడ్ లో తగ్గింది అని చెప్పవచ్చు.

Read More: మీ నాన్నను చూసి నేర్చుకో.. ఆయన పరువు తీయకు: ఆర్యన్‌పై ఫ్యాన్స్ ఫైర్

Advertisement

Next Story