‘బలగం’ వేణు రెండో చిత్రంలో హీరో అతడేనా?

by Anjali |   ( Updated:2023-07-30 05:21:41.0  )
‘బలగం’ వేణు రెండో చిత్రంలో హీరో అతడేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బలగం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వేణు. ఈ సినిమా చాలా అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు.. ఈ మూవీపై ప్రశంసలు కురింపించారు. ఇదిలా ఉంటే.. వేణు మరో మూవీని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఇందుకోసం కొన్ని వారాల క్రితం వేణు తన తదుపరి ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తాజాగా ప్రకటించారు. మొదటి సినిమాలాగే సింపుల్ గానే ఉండాలని, బలగం మాదిరిగా అందరికీ కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో వేణు మంచి స్టోరీ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలోను హీరోగా ప్రియదర్శినే నటించబోతున్నట్లుగా సమాచారం. అతి త్వరలోనే సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని నెట్టింట టాక్ వినిపిస్తోంది.

Also Read : Akshara Gowda Bikki Photos : అందాలను చూపిస్తున్న హాట్ బ్యూటీ.

Advertisement

Next Story