- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘పుష్ప -2’ కోసం అల్లు అర్జున్ ఇంతగా కష్టపడుతున్నాడా.. నిజంగా హాట్సాఫ్..!
దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘పుష్ప2’ ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆల్రెడీ చిత్రబృందం ప్రకటించడం జరిగింది. దీంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది మూవీ టీం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బన్ని.. ఈ మూవీ కోసం తను ఎంత కష్టపడుతున్నాడో చెప్పుకొచ్చాడు.
‘ఇప్పుడు నేను ‘పుష్ప2’ సినిమా షూటింగ్ నుంచే వచ్చాను. ప్రజంట్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. లాస్ట్ టైం రిలీజ్ చేసిన జాతర పోస్టర్ ను అందరు చూశారు కదా. ఆ జాతర సీన్ షాట్ షూటింగ్ జరుగుతోంది. ఈ గెటప్ కోసం నేను చాలా కష్టపడాను. ఈ మేకప్ కోసం రెండు గంటల సమయం పడుతుంది. మేకప్ తీయడానికి కూడా అంతే సమయం పడుతోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇది విన్న అభిమానులు అల్లు అర్జున్ డెడికేషన్ కు హాట్సాఫ్ చెప్తున్నారు.
- Tags
- Pushpa