- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉరితాడుతో హల్ చల్ చేసిన మోడల్
దిశ, సినిమా: ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు కొంతమంది నటీమణులు వీక్షకులను మంత్రముగ్దుల్ని చేసే అందాలతో అలరిస్తుంటే.. మరికొందరు తమదైన రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇటీవల ‘ఫక్ యు పుతిన్’ అని రాసివున్న టీషర్ట్‌తో ఉక్రెయిన్ సెలబ్రిటీ హల్ చల్ చేయగా.. తాజాగా మెడకు ఊరితాడు బిగించినట్లు డిజైన్ చేసిన దుస్తులతో ఇరానియన్ మోడల్ మహ్లాఘ జబేరి అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచి అలరించిన బ్యూటీ.. ఇరాన్‌లో ఉరిశిక్షలను నిలిపివేయాలని పిలుపునిచ్చేందుకే ఈ వేషాధారణలో వచ్చినట్లు తెలిపింది. ‘ఈ సంవత్సరం ఉరిశిక్షలు పెరిగాయి. ఇది మానవ హక్కులకు ముప్పు. ఇరాన్‌లోని కఠినమైన పరిస్థితులు, భయంకరమైన హత్యలకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలకు మద్దతిచ్చేందుకు అంతర్జాతీయ వేదికను ఎంచుకన్నా’ అని చెప్పింది. అలాగే ఈ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ.. ‘ఉరితీయడం ఆపండి’ అనే ప్రకటనతో సంచలనం సృష్టించింది.
Read More... సమంత ధరించిన చెప్పుల ఖరీదేంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
రాబోయే తరాలకు చాలా అవసరమైన సినిమా ఇది: కృతిసనన్
పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం ఏంటి.. సంయుక్త ఎఫైర్‌పై మండిపడుతున్న నెటిజన్లు..!